హిందుత్వను ఐసీస్‌తో పోల్చొద్దు: గులాంనబీ ఆజాద్

ABN , First Publish Date - 2021-11-12T02:59:03+05:30 IST

హిందుత్వను రాజకీయంగా వ్యతిరేకించినప్పటికీ దానిని ఐసిస్, జిహాది లాంటి ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోల్చడం అతిశయోక్తని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. అయోధ్య తీర్పుపై సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంపై ఆజాద్..

హిందుత్వను ఐసీస్‌తో పోల్చొద్దు: గులాంనబీ ఆజాద్

న్యూఢిల్లీ: హిందుత్వను రాజకీయంగా వ్యతిరేకించినప్పటికీ దానిని ఐసిస్, జిహాది లాంటి ఇస్లామిక్ ఉగ్రవాదంతో పోల్చడం అతిశయోక్తని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. అయోధ్య తీర్పుపై సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంపై ఆజాద్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖుర్షీద్ పుస్తకంలో అయోధ్య తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా బాబ్రీని కూల్చడాన్ని హిందుత్వ ఉగ్రవాదంగా ప్రస్తావించారని అంటున్నారు. కాగా, దీనిపై గురువారం స్పందించిన ఆజాద్ ‘‘రాజకీయపరంగా హిందుత్వ భావజాలాన్ని మనం తప్పకుండా వ్యతిరేకించాల్సిందే. కానీ దానిని ఇస్లామిక్ ఉగ్రవాదమైన ఐసిస్, జిహాదీలతో పోల్చడం సరికాదు. అతి పూర్తిగా తప్పు, అతిశయోక్తి. ఈ రెండు వాదాలకు చాలా తేడా ఉంది. ఐసిస్, జిహాదీ లాంటి సంస్థలకు అసలు మానవత్వమే ఉండదు’’ అని అన్నారు.

Updated Date - 2021-11-12T02:59:03+05:30 IST