మిడిమిడి నటనతో ఇండ్రస్టీ వైపు రావద్దు

ABN , First Publish Date - 2022-07-07T04:57:11+05:30 IST

నటుడిని కావాలనే ఆశతో .., మిడిమిడి నటనతో ఇండ్రస్టీ వైపు రావద్దని పూర్తి ఆసక్తి, పట్టుదల, ప్రతిభ ఉన్న వాళ్లకు కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని జబర్దస్ట్‌ ఆర్టిస్ట్‌, సినీ నటుడు అప్పారావు అన్నారు. బుధవారం అద్దంకిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కళలకు పెట్టింది పేరు అయిన అద్దంకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

మిడిమిడి నటనతో ఇండ్రస్టీ వైపు రావద్దు
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జబర్దస్‌ ఆర్టిస్ట్‌ అప్పారావు

జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌ , సినీ నటుడు అప్పారావు

అద్దంకిటౌన్‌, జూలై 6: నటుడిని కావాలనే ఆశతో .., మిడిమిడి నటనతో ఇండ్రస్టీ వైపు రావద్దని పూర్తి ఆసక్తి, పట్టుదల, ప్రతిభ ఉన్న వాళ్లకు కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని జబర్దస్ట్‌ ఆర్టిస్ట్‌, సినీ నటుడు అప్పారావు అన్నారు. బుధవారం అద్దంకిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కళలకు పెట్టింది పేరు అయిన అద్దంకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నం అక్కయపాలెంకు చెందిన నేను ఇప్పటి వరకు 250 సినిమాల్లో, 70 సీరియల్స్‌లో నటించానన్నారు. కళారంగం సంతృప్తినిచ్చిందని, ఆర్థికంగా నిలదొక్కుకుంది మాత్రం సినిమా రంగమేనన్నారు. హీరో మహే్‌షబాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన పాత్రతో మంచి గుర్తింపు వచ్చిందని, ఆ సినిమా తరువాత 80 సినిమాల్లో నటించానన్నారు. మరికొన్ని సినిమాలు ఒప్పుకున్నానని, కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రాధాన్యత, గుర్తింపులేని పాత్రలు చేయడం నచ్చక జబర్దస్ట్‌ నుంచి బయటకు వచ్చానన్నారు. నేను కష్టపడి కుటుంబ సభ్యుల సహాకారంతో ఈ రంగంలో రాణించగలిగానన్నారు. ఈ సమావేశంలో టీడీపీ బాపట్ల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గోవాడ శ్రీకాంత్‌, నూకతోటి జయబాబు, చేబ్రోలు వెంకట సుబ్బయ్య, అద్దెటి సుబ్బారావు, ముక్తేశ్వరం ఆచారి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-07-07T04:57:11+05:30 IST