చట్టాన్ని వ్యతిరేకిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-06T04:53:35+05:30 IST

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్నారు.

చట్టాన్ని వ్యతిరేకిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
ఎస్పీ ఫక్కీరప్పకు పుష్పగుచ్చం అందజేస్తున్న డీఎస్పీ


కర్నూలు, డిసెంబరు 5:  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీ్‌సస్టేషన్‌ల పరిధిలలోని సమస్యాత్మక గ్రామాలలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అటువంటి చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.  


స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ బాధ్యతల స్వీకరణ

కర్నూలు స్పెషల్‌ బ్రాంచి-1 డీఎస్పీగా మహేశ్వరరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం జిల్లాకు చెందిన మహేశ్వరరెడ్డి 1995 బ్యాచ్‌ ఎస్‌ఐగా పోలీస్‌ శాఖలో చేరారు. రుద్రవరం, అవుకు, ఉయ్యా లవాడ, ఎమ్మిగనూరు పోలీస్‌స్టేషన్‌లలో ఎస్‌ఐగా పని చేశారు. సీఐగా పదోన్నతి పొంది విజిలెన్స్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌, ప్రొద్దుటూరు, కర్నూలు తాలుకా, స్పెషల్‌ బ్రాంచ్‌, కర్నూలు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లలో పని చేస్తూ డీఎస్పీగా పదోన్నతి పొందారు. 


6న 30 యాక్ట్‌ అమలు: డీఎస్పీ

 ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు ఈ నెల 6న బ్లాక్‌ డే సందర్భంగా 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ మహేష్‌ తెలిపారు. శనివారం ఆయన  వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ), సోషల్‌ డెమోక్రటిక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీఐ) నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేష్‌ మాట్లాడుతూ డిసెంబరు 6న బ్లాక్‌ డే సందర్భంగా 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందన్నారు.  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు.   ఈ కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ విక్రమ సింహ ఉన్నారు. 

Updated Date - 2020-12-06T04:53:35+05:30 IST