‘కార్మికుల కడుపు కొట్టొద్దు’

ABN , First Publish Date - 2022-08-06T05:50:55+05:30 IST

నంద్యాల జిల్లావ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, స్వీపర్లు, ఆయాలుగా పనిచేస్తున్న వారి కడుపుకొట్టవద్దని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి.శ్రీనివాసులు అన్నారు.

‘కార్మికుల కడుపు కొట్టొద్దు’
నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

నంద్యాల టౌన్‌, ఆగస్టు 5: నంద్యాల జిల్లావ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులు, స్వీపర్లు, ఆయాలుగా పనిచేస్తున్న వారి కడుపుకొట్టవద్దని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి.శ్రీనివాసులు అన్నారు. నంద్యాలలోని మున్సిపల్‌ టౌన్‌హాల్‌ ఆవరణలో శుక్రవారం కార్మికుల ముఖ్య ప్రతినిధుల సమావేశం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ కేవలం రూ.6వేలు జీతాలు పొందుతున్న కార్మికులు, పెరిగిన ధరలతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే వీరికి రూ.15వేలకు జీతాన్ని పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్మికులు సుబ్బమ్మ, ఓబులమ్మ, సలోమి, సుభద్రమ్మ, బాల పక్కీరమ్మ, పద్మావతమ్మ, సరళమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-06T05:50:55+05:30 IST