Abn logo
Jan 13 2021 @ 22:39PM

రెచ్చగొడ్తే ఊరుకోం


- బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకుల ఫైర్‌

ధన్వాడ, జనవరి 13 : అక్రమ దందాలకు పాల్పడే బీజేపీ నాయకులు మాపైనే విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ మండల నాయకులు మండిపడ్డారు. బుధవారం ధన్వాడలో సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి స్వగృ హంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మురళీధర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, వెం కట్రామ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ధన్వాడ జడ్పీటీసీ భర్త తన భార్య పదవిని అడ్డం పెట్టుకొని ఇసుక అక్రమ దందాను కొనసాగి స్తుంటే బీజేపీ నాయకులు నీతివంతులుగా మాట్లాడటం విచిత్రంగా ఉందన్నా రు. గూండాగిరి చేస్తే తాము కూడా తగిన బుదిఽ్ధ చెప్తామని టీఆర్‌ఎస్‌ నాయ కులు హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు భగవంతురెడ్డి, శివారెడ్డి, నర్సిములు నాయుడు పాల్గొన్నారు.


Advertisement
Advertisement