అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-08-05T06:01:42+05:30 IST

అగ్నిప్రమాద బాధితులు అధైర్య పడవద్దని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులు అయిన గుర్రం పో సులు, గుర్రం రవి కుటుంబాలను బుధవారం పరామర్శించారు. పూర్తిగా కాలిపో యిన పోసులు కుటుంబానికి 95 వేల ప్రొసిడింగ్‌ను, పాక్షికంగా కాలిపోయిన రవి కుటుంబానికి 50 వేల ప్రొసిడింగ్‌ కాపీని అందజేశారు.

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
బాధితులతో మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

లక్ష్మణచాంద, ఆగస్టు4: అగ్నిప్రమాద బాధితులు అధైర్య పడవద్దని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులు అయిన గుర్రం పో సులు, గుర్రం రవి కుటుంబాలను బుధవారం పరామర్శించారు. పూర్తిగా కాలిపో యిన పోసులు కుటుంబానికి 95 వేల ప్రొసిడింగ్‌ను, పాక్షికంగా కాలిపోయిన రవి కుటుంబానికి 50 వేల ప్రొసిడింగ్‌ కాపీని అందజేశారు. ఈ మొత్తాన్ని త్వరలో చెక్కు రూపంలో అందజేయనున్నారు. డబుల్‌ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అల్లోల సురేందర్‌ రెడ్డి బాధిత కుటుంబానికి రూ.15 వేల నగదును అం దజేశారు. ఇజ్రాయెల్‌లో ఉన్న ఫొటోస్టూడియో రాజేశ్వర్‌ అనే లక్ష్మణచాంద ఎ న్‌ఆర్‌ఐ రూ.5 వేలను అందజేశారు. కనకాపూర్‌ గ్రామంలో ప్రమాదవశాత్తు మ రణించిన వెంకటేష్‌ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ చె ౖర్మన్‌ ఎర్ర రఘునందన్‌ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మీరమేష్‌, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కృష్ణారెడ్డి, అడ్వాల రమేష్‌, సర్పంచ్‌ సురకంటి ముత్యం రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్‌ నాయకులు సల్ల రాజేంద్రప్రసాద్‌, ఈటెల శ్రీనివాస్‌, సయ్యద్‌ జ హీరుద్దీన్‌, గురాల లింగారెడ్డి, సయ్యద్‌, బిట్లింగ్‌ పాల్గొన్నారు.

జీఎన్‌ఆర్‌ కాలనీ సందర్శించిన మంత్రి అల్లోల

నిర్మల్‌ కల్చరల్‌: జీఎన్‌ఆర్‌ కాలనీని మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌తో మంత్రి అ ల్లోల సందర్శించారు. భారీ వర్షాలకు కాలనీ నీటిమయం కాగా పరిస్థితిని అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణాలు, సిద్దాపూర్‌లోని వాటర్‌ సప్లై సిస్టం సందర్శించారు. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఆర్డీవో రా థోడ్‌ రమేష్‌, ఇతర శాఖల అధికారులు మంత్రి వెంట ఉన్నారు. 

Updated Date - 2021-08-05T06:01:42+05:30 IST