అనామక ఫిర్యాదులపై స్పందించొద్దు: సీవీసీ

ABN , First Publish Date - 2020-09-28T08:20:03+05:30 IST

అవినీతిపై వచ్చే అనామక ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవద్దని అన్ని ప్రభుత్వ శాఖలకు సెంట్రల్‌ విజిలెన్సు కమిషన్‌(సీవీసీ) సూచించింది. ఈ అంశంపై సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ), సీవీసీ గతంలో జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడాన్ని ఒక నిఘా సంస్థ వెలుగులోకి తెచ్చింది...

అనామక ఫిర్యాదులపై స్పందించొద్దు: సీవీసీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: అవినీతిపై వచ్చే అనామక ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవద్దని అన్ని ప్రభుత్వ శాఖలకు సెంట్రల్‌ విజిలెన్సు కమిషన్‌(సీవీసీ) సూచించింది. ఈ అంశంపై సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ), సీవీసీ గతంలో జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడాన్ని ఒక నిఘా సంస్థ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఫిర్యాదుదారుని పేరు, వివరాలు లేకపోవడం.. నకిలీ పేరు, వివరాలు రాయడం వంటి ఫిర్యాదులపై స్పందించొద్దంటూ సీవీవీ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను హెచ్చరించింది.


Updated Date - 2020-09-28T08:20:03+05:30 IST