Donot use shampoo: అణుయుద్ధం జరిగితే...యూఎస్ సంచలన సలహా

ABN , First Publish Date - 2022-09-23T17:46:31+05:30 IST

అమెరికా దేశ పౌరులకు శుక్రవారం ఆ దేశ సర్కారు సంచలన సలహా ఇచ్చింది...

Donot use shampoo: అణుయుద్ధం జరిగితే...యూఎస్ సంచలన సలహా

న్యూయార్క్(అమెరికా): అమెరికా దేశ పౌరులకు శుక్రవారం ఆ దేశ సర్కారు సంచలన సలహా ఇచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగుతున్నందున రష్యా అణ్వాయుధాలను(nuclear war) ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని వార్తలు వెలువడిన నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. అణుయుద్ధం జరిగినప్పుడు మీ జుట్టుకు షాంపూలు, కండీషనర్ లను(Donot use conditioner) ఉపయోగించవద్దని యూఎస్ సూచించింది.(US issued dos and don'ts) సాధారణ రోజుల్లో షాంపూ, కండిషనర్లు(shampoo and conditioners) మీ జుట్టును రక్షిస్తాయి.కాని అణు విస్ఫోటనం(nuclear explosion) సంభవించినప్పుడు షాంపూలు, కండిషనర్లు మీ జుట్టుకు రేడియోధార్మిక పదార్ధాల మధ్య జిగురుగా పని చేస్తాయని యూఎస్ తెలిపింది. 


రేడియోధార్మిక పదార్థాలను ట్రాప్ చేసే అవకాశం ఉన్నందున షాంపూలు, కండీషనర్‌లను ఉపయోగించవద్దని ప్రజలకు సూచించింది.అణుబాంబు పేలితే(nuclear bomb explodes) రేడియోధార్మిక ధూళి కణాలు గాలిలోకి విసిరివేసినట్లయితే, మీరు వీలైనంత త్వరగా స్నానం చేయాలని యూఎస్ సలహా ఇచ్చింది. అణువిస్పోటనం జరిగినపుడు ప్రజలు కలుషితమైన పాత దుస్తులను తొలగించి వెంటనే స్నానం చేయాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (Disease Control and Prevention) ప్రజలకు సూచించింది.


 రేడియేషన్ ను నివారించడానికి మీ జుట్టుపై కండీషనర్లను ఉపయోగించకుండా ఉండాలని యూఎస్ సలహా ఇచ్చింది.ఈ రేడియోధార్మిక కణాలు మనిషి కణాలను దెబ్బతీస్తాయని, అవి ప్రాణాంతకం కావచ్చని యూఎస్ పేర్కొంది.అణు విస్ఫోటనం జరిగితే ప్రజలు రేడియేషన్‌ను నివారించడానికి ఇటుక లేదా కాంక్రీట్ భవనం లోపల ఆశ్రయం పొందాలని యూఎస్ సిఫార్సు చేసింది. ప్రజలు తమ కళ్లు, ముక్కు నోటిని తాకకుండా ఉండాలని కూడా యూఎస్ సూచించింది.


Updated Date - 2022-09-23T17:46:31+05:30 IST