Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 15 Sep 2021 17:49:55 IST

గాడిద పాలతో సబ్బులేంటని నవ్వినవాళ్లే ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.. ఒక్కో సబ్బును ఎంతకు అమ్ముతున్నారంటే..

twitter-iconwatsapp-iconfb-icon
గాడిద పాలతో సబ్బులేంటని నవ్వినవాళ్లే ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.. ఒక్కో సబ్బును ఎంతకు అమ్ముతున్నారంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఐడియా చెప్పగానే అందరూ పగలపడి నవ్వారు.. స్నేహితులు, కుటుంబసభ్యులు అనే తేడా లేకుండా అందరూ ఎగతాళి చేసిన వారే. ‘‘గాడిద పాలతో సబ్బులు చేస్తావా...ఆపై లాభాలు గడిస్తావా..’’అంటూ మొహమ్మీదే ఎగసెక్కాలు ఆడారు. సరిగ్గా ఏడాది కిత్రం..ఇటువంటి ప్రతికూలత మధ్య అతడు తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం అతడు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ..భారీగా లాభాలు గడిస్తున్నాడు. జోర్డాన్‌కు చెందిన 32 ఏళ్ల ఎమాద్ అట్టియట్ సక్సెస్ స్టోరీ ఇది. 

ఇటువంటి వ్యాపారంలోకి దిగాడంటే..ఎమాద్‌ది వ్యవసాయం నేపథ్యం అనుకుంటే మనం పొరబడినట్టే..! ఎందుకంటే.. అతడు మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో పీజీ చేశాడు. అయితే.. తన చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క చాలా కాలం పాటు అవస్థలు పడ్డాడు. చివరికి తన తల్లి సలహా మేరకు ఎమాద్ ఈ వ్యాపారంలోకి దిగి విజయం సాధించాడు. గాడిద పాలతో సబ్బులు చేయాలన్న ఆలోచన మొదట ఎమాద్ తల్లికి వచ్చింది. ఈ ఐడియా సాధ్యాసాధ్యాలపై వారు కొంత కాలం సమీక్షించుకున్నాక  కార్యరంగంలోకి దిగారు. జోర్డాన్‌లో ఎవ్వరూ కూడా అప్పటివరకూ గాడిద పాల సబ్బుల గురించి వినలేదు. దీంతో..అతడి ఐడియా విని పెదవివిరిచిన వారు..నిరుత్సాహపరిచిన వారే ఎక్కువ. అయితే.. ఎన్ని విమర్శలు, నెగెటివ్ కామెంట్స్ వచ్చినా కూడా వారు వెనకడుగు వేయక తమ ఐడియాపై అచంచల విశ్వాసంతో ముందుకెళ్లారు. ఫలితం.. ఏడాది తిరిగే సరికల్లా వారు మంచి లాభాలు కళ్లజూడటం ప్రారంభించారు. 

ఎమాద్ స్థాపించిన సంస్థ పేరు అటాన్ డాంకీ మిల్క్ సోప్స్. అరబ్బీలో అటాన్ అంటే ఆడ గాడిద అని అర్థం. అమ్మాన్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడాబా అనే ప్రాంతంలో వీరు 12 గాడిదలను పెంచుతున్నారు. ఒక్కో గాడిద రోజుకు రెండు లీటర్ల పాలు ఇస్తుంది. లీటరు పాల కోసం రోజులో మూడు సార్లు ఎలక్ట్రానిక్ హ్యాండ్ పంప్ సాయంతో అక్కడి సిబ్బంది పాలు పితుకుతారు. మిగతాది గాడిద పిల్లల కోసం వదిలేస్తారు. ఇలా వచ్చిన పాలను శీతలీకరించాక వాటిని జోర్డాన్ రాజధానిలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ ఎమాద్ తల్లి స్వీయ పర్యవేక్షలో ఈ సబ్బులు తయారవుతాయి. 

ఇవీ చదవండి:
SBI లో భారీ మోసం.. అసిస్టెంట్ మేనేజర్ పక్కా స్కెచ్.. కస్టమర్లకు తెలియకుండానే ఖాతాల్లోంచి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి..


61 ఏళ్ల బామ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న 24 ఏళ్ల కుర్రాడు.. కారణమేంటని అడిగితే అతడి రెస్పాన్స్ ఇదీ..!

గాడిద పాలకు ఇతర తైలాలు, వనమూలికలు జోడించి ఓ మిశ్రమాన్ని సిద్దం చేస్తారు. దాన్ని మూసలో పోసి..గడ్డకట్టేలా చేస్తే గాడిద పాల సబ్బులు తయారువుతాయి. లీటరు పాలతో 30 సబ్బులు ఉత్పత్తి చేయవచ్చు.  గాడిద పాల ద్వారా చర్మానికి మంచి నిగారింపు వస్తుందన్న భావన కారణంగా కస్టమర్లు ప్రస్తుతం ఈ సబ్బుల కోసం విపరీతంగా ఎగబడుతున్నారు. ప్రస్తుతం ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఆ సంస్థ నెలకు 4500 సబ్బు బిళ్లలను ఉత్పత్తి చేస్తోంది.  85 గ్రాముల సబ్బు ధర 11 డాలర్లు ( దాదాపు 807 రూపాయలకు పైగానే) 125 గ్రాముల సబ్బు ధర 14 డాలర్లు (దాదాపు 1000 రూపాయలకు పైగానే). ఇక ఐరోపాలో లీటరు గాడిద పాల ధర అత్యధికంగా 70 డాలర్లు ఉంటుంది.. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు..ఎమాద్ ఆదాయం ఏ స్థాయిలో ఉందో..!

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.