డొంకరాయి నీరు విడుదల

ABN , First Publish Date - 2021-07-25T05:51:17+05:30 IST

సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలకు వరదనీటి తాకిడి తగ్గింది. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 1036.2 అడుగులకు చేరింది.

డొంకరాయి నీరు విడుదల
డొంకరాయి జలాశయం

పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి 3,500 క్యూసెక్కులు 


సీలేరు, జూలై 24: సీలేరు కాంప్లెక్సులోని జలాశయాలకు వరదనీటి తాకిడి తగ్గింది. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 1036.2 అడుగులకు చేరింది. అయితే రెండు రోజులుగా డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో ఇక్కడ నీటిమట్టాలు పెరగకుండా జెన్‌కో అధికార్లు చర్యలు చేపట్టారు. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రానికి 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో మూడు యూనిట్ల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి గ్రిడ్‌ అధికారులను స్థానిక అధికారుల కోరారు. జోలాపుట్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 2,715 అడుగుల నీటిమట్టం ఉంది. అలాగే బలమెల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,516 అడుగులు కాగా ప్రస్తుతం 1,463 అడుగుల నీటిమట్టం ఉంది. బలిమెల,జోలాపుట్‌ జలాశయాలు ఆగస్టు చివరి నాటికి నిండుతాయని జెన్‌కో అధికార్లు అంచనా వేస్తున్నారు. గుంటవాడ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,360 అడుగులు కాగా ప్రస్తుతం 1,347 అడుగులు ఉంది.  

Updated Date - 2021-07-25T05:51:17+05:30 IST