Advertisement
Advertisement
Abn logo
Advertisement

దొంగ కేసులు బనాయించడం దారుణం

వెంకటగిరి(టౌన్‌), డిసెంబరు 8: న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై వైసీపీ ప్రభుత్వం దొంగ కేసులు బనాయించడం దారుణమని  బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ నాడు ఏపీ రాజధాని కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని అక్కడ కాదు అనడం సరికాదన్నారు.  అమరావతి రైతులకు బీజేపీ ప్రభుత్వం  అండగా నిలిచిందన్నారు. ఈ నెల 24, 25, 26  తేదీల్లో బీజేపీ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్‌, శ్రావణ్‌కుమార్‌ యాదవ్‌, అల్లం చంద్రమోహన్‌ రావు, వడ్లమూడి భాస్కర్‌, కోటి, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement