దొంగ సర్టిఫికెట్లతో కో-ఆప్షన్‌ పదవులు!

ABN , First Publish Date - 2021-09-29T06:06:31+05:30 IST

క్రిస్టియన్‌లుగా దొంగ సర్టిఫి కెట్లు తీసుకుని కో-ఆప్షన్‌ సభ్యులైన వారి పదవులు రద్దు చేయాలని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు కోరారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డికి లేఖ పంపారు.

దొంగ సర్టిఫికెట్లతో కో-ఆప్షన్‌ పదవులు!

కలెక్టర్‌తో విచారణ జరిపించి రద్దు చేయవలసిందిగా విజయసాయికి దాడి లేఖ


అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 28: క్రిస్టియన్‌లుగా దొంగ సర్టిఫి కెట్లు తీసుకుని కో-ఆప్షన్‌ సభ్యులైన వారి పదవులు రద్దు చేయాలని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు కోరారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డికి లేఖ పంపారు. మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లో మైనారిటీలకు రిజర్వు చేయబడిన కో-ఆప్షన్‌ సభ్యుల పదవులకు హిం దువులను ఎంపిక చేయడం దురదృష్టకరమన్నారు. క్రిస్టి యన్‌లుగా దొంగ సర్టిఫికెట్లను పొంది మైనారిటీ పద వులు పొందడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో క్రిస్టియన్లు, ముస్లింలు పాల్గొనడానికి అవకాశాలు తక్కువ కనుక కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎం పిక చేసుకోవడానికి చట్టాలు చేయబడ్డాయని వివరిం చారు. అయితే కొంతమంది క్రిస్టియన్‌లుగా దొంగ సర్టిఫి కెట్లు పొంది పదవి కోసం హిందూత్వానికి, క్రిస్టియా నిటీకి వెన్నుపోటు పొడవడం అధర్మమన్నారు. జిల్లా కలెక్టర్‌తో విచారణ జరిపించి దొంగ సర్టిఫికెట్లు పొం దినవారి పదవులను రద్దు చేయాలని, రాజ్యాంగబద్ధ మైన మైనారిటీ హక్కులను కాపాడాలని లేఖలో విజయసాయిరెడ్డిని కోరినట్టు వీరభద్రరావు తెలిపారు.


మరో 42 కరోనా కేసులు

విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 42 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,57,067కు చేరింది. ఇందులో 1,55,085 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ బారినపడి 1,088 మంది చనిపోయారు.

Updated Date - 2021-09-29T06:06:31+05:30 IST