దోనెల సవారీకి అనుమతి

ABN , First Publish Date - 2022-06-21T16:21:18+05:30 IST

దిండుగల్‌ జిల్లా హొగెనేకల్‌ జలపాతాల వద్ద దోనెల సవారీకి జిల్లా యంత్రాంగం అనుమతించింది. కావేరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాల కారణంగా

దోనెల సవారీకి అనుమతి

ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 10: దిండుగల్‌ జిల్లా హొగెనేకల్‌ జలపాతాల వద్ద దోనెల సవారీకి జిల్లా యంత్రాంగం అనుమతించింది. కావేరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాల కారణంగా హొగెనేకల్‌ కావేరి నదిలో ప్రవాహం 4 వేల నుంచి 12 వేల ఘనపుటడుగులకు పెరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా చర్యగా హొగెనేకల్‌ జలపాతాల వద్ద పర్యాటకుల స్నానాలు, దోనెల సవారీకి నిషేధం విధించారు. ప్రస్తుతం నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో స్నానాలు, దోనెల సవారీకి అనుమతిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ శాంతి ఉత్తర్వులు జారీచేశారు.


Updated Date - 2022-06-21T16:21:18+05:30 IST