ఆ పాట వింటున్న కోవిడ్ పేషెంట్.. వీడియో షేర్ చేసిన డాక్టర్

ABN , First Publish Date - 2021-05-11T23:13:27+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలోని ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. ఇంకా లక్షల మంది బెడ్లు దొరక్క ఆసుపత్రుల బయట ..

ఆ పాట వింటున్న కోవిడ్ పేషెంట్.. వీడియో షేర్ చేసిన డాక్టర్

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలోని ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. ఇంకా లక్షల మంది బెడ్లు దొరక్క ఆసుపత్రుల బయట పడిగాపులు కాస్తున్నారు. ఇక ఐసీయూలో బెడ్లు దొరకడం మరింత గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ కరోనా పేషెంట్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. దీంతో ఆక్సిజన్ సపోర్ట్‌ అవసరమైంది. అయితే ఐసీయూలో ఖాళీ లేకపోవడంతో జనరల్ వార్డులోనే ఆమె ఉంటోంది. ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని ఊపిరి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పక్కనే బ్లూటూత్ స్పీకర్ ఒకటి పెట్టుకుని చక్కగా బాలీవుడ్ సాంగ్స్ వింటూ టైం పాస్ చేస్తోంది. ఈ వీడియోను మోనికా లాంగెహ్ అనే డాక్టర్ తన సోషల్ మీడియాలో ట్విటర్‌లో షేర్ చేశారు.


ఈ వీడియోలో సదరు పేషెంట్ బెడ్‌పై ఆక్సిజన్ సపోర్ట్‌తో కూర్చుని బాలీవుడ్ పాట ‘లవ్ యూ జిందగీ’ పాట వింటుండడం గమనించవచ్చు. డాక్టర్ వీడియో తీస్తుంటే ఆ వీడియోకు ‘హాయ్’ కూడా చెప్పింది. ఈ వీడియోను షేర్ చేసిన డాక్టర్.. ‘ఈమె ఓ కోవిడ్ పేషెంట్. వయసు 30 సంవత్సరాలు. ఆమెకు ఐసీయూలో బెడ్ లభించలేదు. కరోనా ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆమెకు చికిత్స అందిస్తున్నాం. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఆక్సిజన్ సపోర్ట్‌తో ఉంటూ కూడా పాటలు వినాలని ఉందని అడిగింది. నేను సరేనన్నారు’ అంటూ మౌనిక చెప్పుకొచ్చారు.



Updated Date - 2021-05-11T23:13:27+05:30 IST