బైక్‌ అంబులెన్స్‌లో గిరిజన మహిళ ప్రసవం

ABN , First Publish Date - 2020-03-30T10:36:14+05:30 IST

బైక్‌ అంబులెన్స్‌లో ఆదివారం గిరిజన మహిళ ప్రసవించింది. ఈ సంఘటన నుర్మతి పంచాయతీ వాకపల్లిలో చోటుచేసుకుంది.

బైక్‌ అంబులెన్స్‌లో గిరిజన మహిళ ప్రసవం

జి.మాడుగుల: బైక్‌ అంబులెన్స్‌లో ఆదివారం గిరిజన మహిళ ప్రసవించింది. ఈ సంఘటన నుర్మతి పంచాయతీ వాకపల్లిలో చోటుచేసుకుంది. వాకపల్లికి చెందిన గర్భిణి బుటారి భూమికకు పురిటినొప్పులు రావడంతో బైక్‌ అంబులెన్స్‌ ద్వారా జి.మాడుగుల తరలిస్తుండగా మార్గమధ్యంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. 

Updated Date - 2020-03-30T10:36:14+05:30 IST