కరోనా కట్టడికి విరాళాల వెల్లువ

ABN , First Publish Date - 2020-03-27T10:19:33+05:30 IST

మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం పలువురు రాజకీయ, పారిశ్రామిక రంగ ప్రముఖులు సీఎం సహాయ నిధి

కరోనా కట్టడికి విరాళాల వెల్లువ

5 కోట్లు అందజేసిన మెఘా సంస్థ

ఎంపీ కోమటిరెడ్డి 50 లక్షలు

బీజేపీ ఎంపీ అర్వింద్‌ 25 లక్షలు

ఎంపీ లాడ్స్‌ నుంచి 5 కోట్లు ప్రకటించిన పసునూరి

ఎంపీపీలు, ఎంపీటీసీల ఫోరం రూ.3.45 కోట్లు


హైదరాబాద్‌, అమరావతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం పలువురు రాజకీయ, పారిశ్రామిక రంగ ప్రముఖులు సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)కు తమవంతుగా ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఎండీ పీవీ కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్‌కు రూ.5 కోట్ల చెక్కును అందించారు. బయో టెక్నిక్స్‌ అధినేత కేఐ వరప్రసాద్‌రెడ్డి, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత కామిరెడ్డి నర్సింహారెడ్డి వేర్వేరుగా సీఎంను కలిసి చెరో రూ.కోటి చెక్కులను ఇచ్చారు. లారస్‌ ల్యాబ్స్‌ సంస్థ సీఈవో డాక్టర్‌ సత్యనారాయణ, ఈడీ చంద్రకాంత్‌రెడ్డిలు సీఎం కేసీఆర్‌కు రూ.50 లక్షల చెక్కును ఇచ్చారు. లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. దాతలందరికీ సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, మీనాక్షి గ్రూప్‌ సంస్థ చైర్మన్‌ కేఎస్‌ రావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివాజీ, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (క్రెడాయ్‌) ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు వేర్వేరుగా రూ.కోటి చెక్కులను ఇచ్చారు.


విజయా డెయిరీ తరఫున తెలంగాణ డెయిరీ డెవల్‌పమెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి రూ.5 లక్షల చెక్కును అందించారు. డీపీకే ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ సంస్థ తరఫున ఫణికుమార్‌, కర్నాల శైలజారెడ్డి 4 వేల ఎన్‌ 95 మాస్కులను మంత్రికి ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ వెంకటరెడ్డి రూ.50లక్షలు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ రూ.25 లక్షలు అందించారు. రాష్ట్ర ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, కో-ఆప్షన్‌ సభ్యుల నెల వేతనం రూ.3.45 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నెల గౌరవ వేతనంరూ.9.51 కోట్లను సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆపద సమయంలో ఈ ఔదార్యం ఎంతో స్ఫూర్తిదాయకమని సీఎం వారిని అభినందించారు.

Updated Date - 2020-03-27T10:19:33+05:30 IST