Abn logo
Sep 19 2021 @ 00:11AM

గణనాథుల ఎదుట అన్నదానాలు

గుండాల : మాసానపల్లి గ్రామంలో అన్నదానం చేస్తున్న ఐలయ్య

జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పూజలు
భూదానపోచంపల్లి / మోత్కూరు / గుండాల / భువనగిరి టౌన / మునుగోడు రూరల్‌  / వలిగొండ / ఆలేరు,  సెప్టెంబరు 18 :
పోచంపల్లి మునిసిపల్‌ కేంద్రంలోని జేఏసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం గణపతి హోమం నిర్వహించారు. కార్యక్రమానికి మునిసిపల్‌ కౌన్సిలర్‌ గుండు మధు ముఖ్యఅతిథిగా హాజరై స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోగ కిరణ్‌కుమార్‌, గౌరీశంకర్‌, బోగ మధు, కర్నాటి నర్సింహ, ఏలె శ్రీశ్రీ, సాయి, మహేందర్‌,  అశోక్‌, గంజి రాజు, పాండు పాల్గొన్నారు. మోత్కూరులో సిద్ధివినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మోత్కూరు మార్కెట్‌ డైరెక్టర్‌ సోమనర్సయ్య, వ్యాపారి గునగంటి సత్యనారాయణ సూచించారు. గుండాల మండలంలోని మాసానపల్లి, రామారం గ్రామాల్లో గణనాథుల వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇనచార్జి బీర్ల అయిలయ్య, జిల్లా నాయకుడు ఈరసరపు యాదగిరిలు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచలు ఏలూరి రాం రెడ్డి, తుమ్మ డెన్నీ్‌సరెడ్డి, ఎంపీటీసీ కేమిడి అనిత, నాయకులు కుమ్మరికుంట్ల రాజరత్నం, సూదగాని రామచంద్రయ్య, ఉట్ల భిక్షం, గూడ మధుసూదనగౌడ్‌, శ్రీశైలం, రాజు పాల్గొన్నారు.
ఫ భువనగిరి పట్టణంలోని పలు గణనాథుల మండపాల్లో హోమపూజలు, కుంకుమార్చనలు, అన్నదానం చేశారు. పూజల్లో జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చెర్మన ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చెర్మన చింతల కిష్టయ్య, కమిషనర్‌ పూర్ణ చందర్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు గూ డూరు నారాయణరెడ్డి, ఏసీపీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఐ సుధాకర్‌ పా ల్గొన్నారు. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌ కాలనీ గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా గుర్రం జలంధర్‌ ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఫ వలిగొండ మండల కేంద్రంలో శివాజీ యువజన సంఘం, పలువురు భక్తజన మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథులను బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.  కార్యక్రమంలో శివాజీ యువజన సంఘం అధ్యక్షుడు బుంగమట్ల మహేష్‌, నాయకులు సాయికుమార్‌, శివకుమార్‌, నవీనకుమార్‌, సుదర్శన, బన్సీలాల్‌, శ్రీశైలం, ఆనంద్‌, సందీ్‌పకుమార్‌ పాల్గొన్నారు. ఆలేరు పట్టణంలోని 1వ వార్డులో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద ఉత్సవ సమితి నిర్వాహకులు అన్నదానం చేశారు.