ఐదు జాతీయ పార్టీలకు... రూ. 921 కోట్ల మేర కార్పొరేట్ విరాళాలు

ABN , First Publish Date - 2022-04-05T01:35:07+05:30 IST

ఆర్ధిక సంవత్సరం 2019-20 లో... అన్ని కార్పొరేట్/బిజినెస్ హౌస్‌లు ఐదు జాతీయ పార్టీలకు మొత్తం రూ. 921.95 కోట్లు విరాళంగా అందించాయి.

ఐదు జాతీయ పార్టీలకు...  రూ. 921 కోట్ల మేర కార్పొరేట్ విరాళాలు

న్యూఢిల్లీ : ఆర్ధిక సంవత్సరం 2019-20 లో... అన్ని కార్పొరేట్/బిజినెస్ హౌస్‌లు ఐదు జాతీయ పార్టీలకు మొత్తం రూ. 921.95 కోట్లు విరాళంగా అందించాయి. దశాబ్దం క్రితం(2004-12)తో పోలిస్తే 2019-20 లో పార్టీలకు కార్పొరేట్ విరాళాలు 143 % పెరిగాయి. రాజకీయ పార్టీలకు చేసిన మొత్తం సహకారంలో 91 శాతం మేర బీజేపీకి విరాళాలందాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషణ ప్రకారం... ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 వేల కంటే ఎక్కువ విరాళాలిచ్చిన దాతల పార్టీలు భారత ఎన్నికల కమిషన్‌కు నివేదించిన వివరాల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. 


నివేదిక మేరకు... బీజేపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌లను మాత్రమే పరిగణించింది. కాగా... బహుజన్ సమాజ్ పార్టీని పరిగణించలేదు. ఈ నివేదికలో విశ్లేషణ కోసం దీనిని పరిగణించలేదు. ఈ కాలంలో... అంటే 2004 నుండి ఏ దాత నుండి రూ. 20 వేల కంటే ఎక్కువ స్వచ్ఛంద విరాళాలు అందలేదని పార్టీ ప్రకటించింది. ఐదు జాతీయ పార్టీలలో బీజేపీ  2,025 కార్పొరేట్ దాతల నుండి గరిష్టంగా రూ. 720.407 కోట్ల మేర  విరాళాలను అందుకుంది, ఆ తర్వాత కాంగ్రెస్... 154 కార్పొరేట్ దాతల నుండి మొత్తం రూ. 133.04 కోట్లు స్వీకరించాయి. ఇక 36 కార్పొరేట్ దాతల నుండి రూ. 57.086 కోట్లతో ఎన్‌సీపీ, ఏడీఆర్ ఉన్నాయి. ఇక 2019-20 లో కాంగ్రెస్, ఎన్‌సీపీ, బీజేపీలకు సంబంధించి...  కార్పొరేట్/వ్యాపార సంస్థల నుండి రూ. 20 వేల కంటే ఎక్కువ స్వచ్ఛంద విరాళాలు వరుసగా 96 శాతం, 95 శాతం, 92 శాతంగా ఉన్నాయి. 

Updated Date - 2022-04-05T01:35:07+05:30 IST