Abn logo
Sep 21 2021 @ 00:15AM

సాయిబాబా ఆలయానికి విరాళం

విరాళం అందజేస్తున్న లింగం మాణిక్య ప్రభు

డోన్‌, సెప్టెంబరు 20: డోన్‌ పట్టణ సమీపంలోని హైవే పక్కన నిర్మిస్తున్న షిరిడీ సాయిబాబా ఆలయానికి మాణిక్య లింగం మాణిక్య ప్రభు అతని కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం ప్రకటించారు. సోమవారం సాయి కమిటీ కార్యదర్శి భాష్యం రమణగౌడు, సభ్యులు కోట్రికే ఫణిరాజ్‌, కందుకూరు పార్థసారధి, కొండా సురేష్‌, శ్రీరాములుగౌడులకు వారు విరాళాన్ని అందజేశారు. మాణిక్యప్రభు మనుమలు అద్విక్‌, అన్వితల పుట్టిన రోజు సందర్భంగా ఈ విరాళాన్ని అందజేశారు.