Abn logo
May 7 2021 @ 01:22AM

దత్త కారుణ ్య ట్రస్టుకు విరాళాలు

కందుకూరు, మే 6 : మచిలీపట్నం సమీపంలోని గూడూరు వద్ద దత్త కారుణ్య ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 108 అడుగుల సాయిబాబా స్మారక స్థూపం నిర్మాణానికి కందుకూరులో పలువురు దాతలు గురువారం విరాళాలు అందజేశారు. వలేటివారిపాలెం ఎస్సై చావా హజరత్తయ్య తమ తల్లిదండ్రులు మాల్యాద్రి, రాఘవమ్మ దంపతుల పేరుతో రూ.5వేలు, కందుకూరు పట్టణానికి చెందిన గోనుగుంట వేణుగోపాలరావు రూ.5వేలు, బీవీ రమణ, సులోచన దంపతులు రూ.4వేలు విరాళంగా వై. వెంకటరెడ్డికి అందజేశారు. విగ్రహ నిర్మాణానికి కందుకూరు  ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దాతలు సహకారం అందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.