వరదరాజస్వామికి వెండి ఆభరణాల విరాళం

ABN , First Publish Date - 2022-08-14T05:59:31+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధమైన వరదరాజ స్వామి ఆలయానికి వెండి కిరీటం, హస్తాలు, శంఖు, చక్రం, కర్ణాలను కాణిపాకానికి చెందిన సుబ్రహ్మణ్యంశెట్టి శనివారం విరాళంగా అందించారు.

వరదరాజస్వామికి వెండి ఆభరణాల విరాళం
వెండి ఆభరణాలను విరాళంగా అందిస్తున్న దాత

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 13: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధమైన వరదరాజ స్వామి ఆలయానికి వెండి కిరీటం, హస్తాలు, శంఖు, చక్రం, కర్ణాలను కాణిపాకానికి చెందిన సుబ్రహ్మణ్యంశెట్టి శనివారం విరాళంగా అందించారు. 2.5 కేజీల వెండితో రూ.1.8లక్షలతో వాటిని తయారు చేయించినట్లు దాత తెలిపారు. దాతకు ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వాద మండపంలో ఆశీర్వదించి, స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్‌ బాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:59:31+05:30 IST