విరాళాన్ని అందజేస్తున్న రామచంద్రుడు, కుటుంబ సభ్యులు
డోన్, డిసెంబరు 2: డోన్ పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి కూరగాయల రామచంద్రుడు, రామాంజినమ్మ దంపతులు వారి కుమారుడు కోడలు రామక్రిష్ణ, లక్ష్మీదేవి దంపతులు రూ.1,01,116 అందజేశారు. గురువారం మణికంఠ బృందం కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందజేశారు. మణికంఠ బృందం సభ్యులు దాతలను సన్మానించారు.