విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి సాయి రమాదేవి
నిజామాబాద్ జిల్లా జడ్జి రమాదేవి
నిజామాబాద్ అర్బన్, నవంబరు 27: అంతర్జాతీ య దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డి సెంబరు 3వ తేదీన కృత్రిమ అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్ పర్సన్ సాయి రమాదేవి తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టులోని తన చాంబర్‌లో అదనపు జిల్లా జడ్జి నర్సిరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోటరీ క్లబ్ నిజామాబా ద్ సహకారంతో దివ్యాంగులకు ఎటువంటి ఖర్చు లే కుండా ఉచిత అవయవదాన కార్యక్రమాన్ని నిర్వహి ంచి వారి అభివృద్ధికి తోడుగా నిలవాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదంలో చేతులు, కాళ్లు కోల్పోయిన వారు, సహజంగా చేతు లు, కాళ్లు లేని వారికి కృత్రిమంగా అవయవాలు అం దజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.