కడపలో జరిగే కళా ఉత్సవాలకు నిత్యావసర వస్తువులను అందజేస్తున్న సీపీఐ మండల సమితీ సభ్యులు
పోరుమామిళ్ల, మే 24 : కడపలో జరిగే ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలకు పోరుమామిళ్ల మండల కమిటీ తరపున రూ.50 వేలు విలువైన నిత్యవసర వస్తువులను సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, వారి బృందం పది రోజుల నుంచి ప్రజల వద్దకు వెళ్లి దాతల సహకారంతో కడపలో జరిగే కళా ఉత్సవాలకు పోరుమామిళ్ల మండలం నుంచి నిత్యావసర వస్తువులు సేకరించి మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో చేతి వృత్తి సంఘం నాయకులు కేశవ, శాఖ కార్యదర్శులు చెన్నయ్య, బెల్లంబాష, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.