Abn logo
Sep 21 2021 @ 00:05AM

రాజగోపుర నిర్మాణానికి విరాళం

విరాళం అందజేస్తున్న భక్తులు

కౌతాళం, సెప్టెంబరు 20: ప్రముఖపుణ్యక్షేత్రం ఉరుకంద ఈరన్న స్వామి దేవస్థానంలో రాజగోపుర నిర్మాణానికి ఆదోని వాస్త వ్యుడు దివంగత తిమ్మయ్యశెట్టి కుమారులు రూ.1,01,116 విరాళంగా అందజేసినట్లు ఆలయ అధికారి మల్లికార్జున తెలిపారు. వారికి స్వామివారి దర్శనాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


ఉరుకంద ఈరన్న స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించనున్న రాజగోపుర నిర్మాణానికి ఆదోని వాస్తవ్యులు రాయచోటి రామయ్య రూ.లక్ష విరాళంగా అందజేసినట్లు ఆలయ అధికారి మల్లికార్జున తెలిపారు. వారికి స్వామివారి దర్శనాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించారు.


ఈరన్న స్వామికి పూజలు


 ఉరుకంద ఈరన్న స్వామి వారిని సోమవారం భక్తులు అధికసంఖ్యలో దర్శించు కున్నారు. తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి గంగపూజ, గణపతిపూజ, పంచామృతాభిషేకం, ఆకుపూజ చేశారు.