దాతలసాయం అభినందనీయం

ABN , First Publish Date - 2020-11-28T05:40:28+05:30 IST

దాతలసాయం అభినందనీయం

దాతలసాయం అభినందనీయం
సీఐకి చెక్కు అందజేస్తున్న ఎంపీటీసీ నారాయణ శర్మ

  • కీసర సీఐ నరేందర్‌గౌడ్‌


కీసర: సీసీకెమెరాల ఏర్పాటుకు దాతల సాయం అభినందనీయమని కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ అన్నారు. కీసరలో సీసీ కెమెరాల ఏర్పాటుకు మండల సహకార సంఘం చైర్మన్‌ రామిడి ప్రభాకర్‌రెడ్డి రూ.లక్ష,  కీసర ఎంపీటీసీ-1 తటాకం నారాయణశర్మ రూ.2లక్షలు శుక్రవారం సీఐకి అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాట్లాడుతూ  నేరాల నియంత్రణకు తమ వంతు భాద్యతగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులు రామిడి ప్రభాకర్‌రెడ్డి, నారాయణశర్మలను అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రమేష్‌, రామాసూర్యం, నాయకులు తటాకం భాను శర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-28T05:40:28+05:30 IST