అధికారి తొందరపాటు! డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత వివరాలు బహిర్గతం!

ABN , First Publish Date - 2020-05-23T17:34:06+05:30 IST

పత్రికా సమావేశంలో ఓ అధికారి వల్ల అనుకోకుండా జిరిగిన పొరపాటు కారణంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్యాంక్ ఖాతా వివరాలు బహిర్గతమైయ్యాయి.

అధికారి తొందరపాటు! డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత వివరాలు బహిర్గతం!

వాషింగ్టన్: పత్రికా సమావేశంలో ఓ అధికారి వల్ల అనుకోకుండా జిరిగిన పొరపాటు కారణంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్యాంక్ ఖాతా వివరాలు బహిర్గతమైయ్యాయి. మే 22న వైట్ హౌస్‌లో జరిగిన పత్రికా సమావేశం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కేయిలీ మెక్కానీ.. కరోనా కట్టడికి ట్రంప్ వ్యక్తిగత స్థాయిలో చేసిన ఆర్థిక సహాయం గురించి ప్రస్తావించారు. ట్రంప్ తన త్రైమాసిక పారితోషికమైన లక్ష డాలర్లను కరోనా కట్టడి కోసం ఆరోగ్య శాఖకు విరాళమిచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాసిన చెక్‌ను విలేకరుల ముందు ప్రదర్శిస్తూ ట్రంప్ సహయాన్ని హై లైట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే చెక్‌పై ట్రంప్ బ్యాంక్ ఎకౌంట్ వివరాలు కూడా ఉండటంతో.. సదరు అధికారి తనకు తెలీకుండా ట్రంప్ వివరాలను బహిరంగ పరిచినట్టైంది. కాగా.. టీవీలలో ఇటువంటి మాక్ చెక్‌లను ప్రదర్శించే సమయంలో వ్యక్తిగత వివరాలను మరుగు పరుస్తారని, వైట్ హౌస్ సమావేశాల్లో ఇటువంటి వాటిని ప్రదర్శించడం అరుదుగా జరుగుతుందని మరో అధికారి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-05-23T17:34:06+05:30 IST