మేఘన్ మార్క్‌లే, ప్రిన్స్ హారీ విడిపోతారు : డొనాల్డ్ ట్రంప్

ABN , First Publish Date - 2022-04-26T18:21:47+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జ్యోతిష్కుడిగా

మేఘన్ మార్క్‌లే, ప్రిన్స్ హారీ విడిపోతారు : డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జ్యోతిష్కుడిగా మారారు. బ్రిటిష్ ప్రిన్స్ హారీ, ప్రముఖ నటి మేఘన్ మార్క్‌లే వైవాహిక బంధం తెగిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రముఖ టెలివిజన్ హోస్ట్ పియెర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


మేఘన్ అంటే హారీకి విసుగొస్తుందని, బోరు కొడుతుందని ట్రంప్ అన్నారు. అతనికి బోర్ కొట్టకపోతే, మేఘన్ మరొక మంచి కుర్రాడిని ఇష్టపడటం ప్రారంభిస్తుందన్నారు. వీరిద్దరూ తమ రాజవంశ బిరుదులను వదులుకోవాలన్నారు. బ్రిటిష్ రాజవంశీకుల గురించి, మరీ ముఖ్యంగా క్వీన్ గురించి మేఘన్ మాట్లాడిన తీరు తనకు నచ్చలేదని చెప్పారు. 


‘‘పెత్తనానికి లోబడటం ఇక చాలు అని హ్యారీ నిర్ణయించుకున్నా, లేదంటే, తాను మరొక అబ్బాయిని మరింత బాగా ఇష్టపడుతున్నట్లు ఆమె నిర్ణయించుకున్నా ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ముగిసిన తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని మోర్గాన్‌తో ట్రంప్ అన్నారు. దీంతో మోర్గాన్ స్పందిస్తూ, హ్యారీ, మేఘన్ బాంధవ్యం ముగిసిపోతుందని అనుకుంటున్నారా? అని అడిగినపుడు ట్రంప్ సమాధానం చెప్తూ, ‘‘ఔను’’ అన్నారు. తాను చాలా బాగా అంచనా వేయగలనని చెప్పారు. తాను దాదాపు అన్నిటినీ ముందుగానే అంచనా వేశానని, ఇది ముగుస్తుందని, ఇది దారుణంగా ముగిసిపోతుందని చెప్పారు. హ్యరీ తిరిగి లండన్‌కు పాకుతూ వెళ్లిపోతారని అన్నారు. హ్యారీని తప్పుదారి పట్టించారని తాను భావిస్తున్నానని చెప్పారు. 


తాను మేఘన్‌కు ఫ్యాన్‌ను కాదని, అమాయకుడైన హ్యారీని అదుపు, ఆజ్ఞలలో పెట్టారని అన్నారు. ప్రిన్స్ ఫిలిప్ మెమోరియల్ సర్వీస్‌కు హ్యారీ హాజరుకాకపోవడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. హ్యారీ ఓ కీలుబొమ్మలా తయారయ్యాడన్నారు. 


Updated Date - 2022-04-26T18:21:47+05:30 IST