టెలిగ్రామ్‌లో చేరిన డొనాల్డ్ ట్రంప్ జూనియర్!

ABN , First Publish Date - 2021-01-24T10:12:09+05:30 IST

అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చేసిన ఓ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాశం అయింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో జాయిన్ అయినట్టు ట్వి

టెలిగ్రామ్‌లో చేరిన డొనాల్డ్ ట్రంప్ జూనియర్!

వాషింగ్టన్: అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చేసిన ఓ ప్రకటన ప్రస్తుతం చర్చనీయాశం అయింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో జాయిన్ అయినట్టు ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో దిగ్గజ సంస్థలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితరల వాటిపై తీవ్ర విమర్శలు చేశారు. దిగ్గజ సంస్థల సెన్సార్‌షిప్ మరింత దిగజారిపోయిందని.. తన తండ్రి ఖాతాలాపై అవి నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. స్వేచ్ఛా ప్రసంగాన్ని గౌరవించే వేదిక ప్రస్తుతం తమకు అవసరం అన్నారు. అందువల్లే తాను టెలిగ్రామ్‌లో చేరినట్టు వివరించారు. కాగా.. ట్రంప్ మద్దతుదారులు జనవరి 6న కేపిటల్ భవనం వద్ద చేసిన రచ్చ కారణంగా ట్రంప్ ఖాతాలను నిలిపివేస్తూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-01-24T10:12:09+05:30 IST