ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి త‌ప్పుకున్న‌ అమెరికా... కార‌ణ‌మిదే!

ABN , First Publish Date - 2020-05-30T14:40:38+05:30 IST

కరోనాతో అధికంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ అమెరికా తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో ఉన్న అన్ని సంబంధాలను తెగ‌తెంపులు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్నిస్వ‌యంగా...

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి త‌ప్పుకున్న‌ అమెరికా... కార‌ణ‌మిదే!

వాషింగ్టన్: కరోనాతో అధికంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ అమెరికా తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో ఉన్న అన్ని సంబంధాలను తెగ‌తెంపులు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్నిస్వ‌యంగా ప్రకటించారు. డబ్ల్యూహెచ్‌వోను చైనా నియంత్రిస్తుందని ట్రంప్ ఆరోపించారు. అందుకే అమెరికా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో సంబంధాన్ని తెంచుకున్న‌ద‌న్నారు. ప్రారంభ దశలో కరోనా వైరస్‌ను నియంత్రించ‌డంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా సంభ‌విస్తున్న‌ కరోనా మరణాలకు డబ్ల్యూహెచ్‌వో పాటు చైనా కారణమని ట్రంప్ ఆరోపించారు. చైనా సంవత్సరానికి 40 మిలియన్ డాలర్లు మాత్రమే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు స‌హాయంగా అందిస్తున్న‌ద‌ని, అయిన‌ప్ప‌టికీ డబ్ల్యూహెచ్‌వో పూర్తిగా చైనా నియంత్రణలో ఉంద‌ని ట్రంప్ పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ సంవత్సరానికి 450 మిలియన్ డాల‌ర్ల‌ సహాయాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు అందిస్తున్న‌ద‌ని అన్నారు. అయినా కూడా త‌మ‌కు అవసరమైన స‌ల‌హాలు ఇవ్వ‌డంతో విఫలమైనందున తాము  డబ్ల్యూహెచ్‌వోతో త‌మ‌ సంబంధాన్ని ముగిస్తున్నామ‌ని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వోకు నిలిపివేసిన నిధులను ప్రపంచంలోని ఇతర ఆరోగ్య సంస్థలకు సహాయం చేయడానికి వినియోగిస్తామ‌ని ట్రంప్ వెల్ల‌డించారు. 

Updated Date - 2020-05-30T14:40:38+05:30 IST