తాలిబన్ల ఎఫెక్ట్.. జో బైడెన్ రాజీనామాకు ట్రంప్ డిమాండ్

ABN , First Publish Date - 2021-08-16T17:00:46+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షడు జో బైడెన్‌పై మండిపడ్డారు. అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థుల నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత ఎన్ని

తాలిబన్ల ఎఫెక్ట్.. జో బైడెన్ రాజీనామాకు ట్రంప్ డిమాండ్

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షడు జో బైడెన్‌పై మండిపడ్డారు. అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థుల నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గత ఎన్నికల్లో గెలిచి, బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ కూడా అందులో ఒకటి. ఈ క్రమంలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యం భద్రతా దళాలు అఫ్ఘానిస్థాన్ నుంచి వెనుదిరిగాయి.



దీంతో ఆదివారం రోజు అఫ్ఘానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడం.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పదవికి రాజీనామా చేసే, విదేశాలకు వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అఫ్ఘానిస్థాన్‌లో ప్రసుతం నెలకొన్న పరిస్థితులకు బైడెన్ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. అంతేకాకుండా తక్షణం అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. బైడెన్ నిర్ణయాల వల్లే ఇది జరిగింది. దీనికి సిగ్గు పడుతూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలి’ అని ట్రంప్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.  


Updated Date - 2021-08-16T17:00:46+05:30 IST