‘మమ్మల్ని క్వారంటైన్‌లో ఉంచొద్దు’

ABN , First Publish Date - 2020-05-30T10:39:40+05:30 IST

తమను క్వారంటైన్‌లో ఉంచొద్దని, నేరుగా ఇంటికి పం పించేయా లని బెంగళూరు నుంచి వచ్చిన పలువురు యువకులు

‘మమ్మల్ని క్వారంటైన్‌లో ఉంచొద్దు’

ఎచ్చెర్ల: తమను క్వారంటైన్‌లో ఉంచొద్దని, నేరుగా ఇంటికి పం పించేయా లని బెంగళూరు నుంచి వచ్చిన పలువురు యువకులు అధికారు లను వేడుకు న్నారు. జిల్లాకు చెందిన సుమారు 50 మంది యువకులు  బెం గళూర్‌ (కర్ణాటక) నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకొని, అక్కడి నుంచి బస్సులో శ్రీకాకుళం బయలుదేరారు. శుక్రవారం పైడిభీమవరం చెక్‌పోస్ట్‌ వద్ద వారిని అధికారులు అడ్డుకొని అంబేడ్కర్‌ యూనివర్సిటీ (ఎచ్చెర్ల)లోని కార్వంటైన్‌ కేంద్రానికి తరలించారు. అయితే, తాము ఇప్పటికే  బెంగళూర్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని, మళ్లీ క్వారంటైన్‌లో ఉంచొద్దంటూ  తహసీ ల్దార్‌ సనపల సుధాసాగర్‌తో వాదనకు దిగారు.


పలాసకు చెందిన ఓ యువతి.. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, ప్లీజ్‌ తనను విడిచిపెట్టాలని వేడుకుంది. నిబంధనల మేరకు ఇతర రాష్ట్రాలు, దేశాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేని తహసీల్దార్‌ తేల్చి చెప్పారు. వర్సిటీలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఒక్కొక్కరికి ప్రత్యేకంగా గదులు కేటాయిస్తున్నామని, అవసరమైన భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని ఆయన వివరించారు. 

Updated Date - 2020-05-30T10:39:40+05:30 IST