Zomato, Swiggyలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Domino's Pizza

ABN , First Publish Date - 2022-07-23T16:35:59+05:30 IST

డొమినోస్ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో(Zomato), స్విగ్గీ(Swiggy) నుంచి కొంత భాగాన్ని

Zomato, Swiggyలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న Domino's Pizza

Domino's Pizza India : డొమినోస్ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ.. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో(Zomato), స్విగ్గీ(Swiggy) నుంచి కొంత భాగాన్ని వెనక్కి తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు తమ కమీషన్‌లు మరింతగా పెంచినట్లయితే దాని నుంచి కొంత భాగాన్ని తీసుకోవడాన్ని పరిశీలిస్తోందని రాయిటర్స్(Reuters) వెల్లడించింది. 


భారతదేశంలో డొమినోస్, డంకిన్ డోనట్స్ చైన్‌(Dunkin' Donuts chain)ను నడుపుతున్న జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్(Jubilant FoodWorks).. జొమాటో, స్విగ్గీలు అవలంబిస్తున్న పోటీ వ్యతిరేక పద్ధతులపై దర్యాప్తు చేస్తున్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కి ఒక రహస్య ఫైల్‌లో ఈ విషయాన్ని వెల్లడించినట్టు రాయిటర్స్ తెలిపింది. 1,567 డొమినోస్, 28 డంకిన్ అవుట్‌లెట్‌లతో సహా 1,600 కంటే ఎక్కువ బ్రాండెడ్ రెస్టారెంట్ అవుట్‌లెట్‌లతో జూబిలెంట్ భారతదేశపు అతిపెద్ద ఆహార సేవల సంస్థగా ఉంది.


ఎక్కువ కమీషన్‌లు వసూలు చేస్తున్నాయని ఆరోపణ..


రెస్టారెంట్ భాగస్వాముల నుంచి ఈ ప్లాట్‌ఫారమ్‌లు వసూలు చేసే కమీషన్‌లు ఆచరణీయమైనవి కావని, అవి 20-30 శాతం వరకూ ఉంటాయని.. నిజానికి ఇవి చాలా ఎక్కువ అని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) ఆరోపించింది. అంతేకాకుండా... జొమాటో, స్విగ్గీలు కలిసి 95 % కంటే ఎక్కువ మార్కెట్‌ను కార్నర్ చేస్తున్నాయని, స్కీమ్‌లు, ఇన్సెంటివ్‌ల ద్వారా కస్టమర్‌లకు డీప్ డిస్కౌంట్ సాధనలో నిమగ్నమై ఉన్నాయని రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. 


ఏప్రిల్‌లో విచారణకు ఆదేశాలు..


భారతీయ రెస్టారెంట్ గ్రూప్ ఆరోపణలపై సీసీఐ స్పందించింది. ఆయా ఫుడ్ డెలివరీ సంస్థలపై ఏప్రిల్‌లో విచారణకు ఆదేశించింది. సీసీఐ తన పరిశోధనలో భాగంగా డొమినోస్ ఇండియా ఫ్రాంచైజీ, అనేక ఇతర రెస్టారెంట్‌ల నుంచి రెస్పాన్స్‌ను కోరిన తర్వాత, జూబిలెంట్ తన ఆన్‌లైన్ అమ్మకాలకు సంబంధించిన డేటాను పంచుకోవడానికి మరింత సమయం కోరింది. అయితే ఫుడ్-ఆర్డరింగ్ ప్లాట్‌ఫారమ్‌ల అధిక కమీషన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ వాచ్‌డాగ్‌కు లేఖ రాసింది.



Updated Date - 2022-07-23T16:35:59+05:30 IST