Domino’s: ఉచితంగా పిజ్జాను ఇలా సొంతం చేసుకోవచ్చు!

ABN , First Publish Date - 2022-08-05T03:22:18+05:30 IST

దేశంలోని అతిపెద్ద పిజ్జా చెయిన్ డొమినోస్ (Domino’s) పిజ్జా ప్రియుల కోసం ‘చీజీ రివార్డ్స్ లాయల్టీ ప్రోగ్రామ్

Domino’s: ఉచితంగా పిజ్జాను ఇలా సొంతం చేసుకోవచ్చు!

హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద పిజ్జా చెయిన్ డొమినోస్ (Domino’s) పిజ్జా ప్రియుల కోసం ‘చీజీ రివార్డ్స్ లాయల్టీ ప్రోగ్రామ్ (Cheesy Rewards Loyalty Program)ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వినియోగదారుల ప్రతి ఆర్డర్ పైనా 100 పాయింట్లు (1Pie) సేకరించుకోవచ్చు. 600 పాయింట్లను సేకరించిన తర్వాత ఉచిత పిజ్జాను సొంతం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఆరు పిజ్జాల తర్వాత ఒక ఉచిత పిజ్జాను పొందొచ్చన్నమాట.


పాత కస్టమర్లతో పాటు కొత్త వారు కూడా ఈ ఆఫర్‌ను పొందొచ్చు. ఏ రెస్టారెంట్‌లోనైనా ఈ ఆఫర్‌ను అందుకోవచ్చు. ప్రతి ఆర్డర్ తర్వాత వినియోగదారుల ఖాతాలో ఓ పిజ్జా స్లైస్ కనిపిస్తుంది. ఆరు ఆర్డర్ల తర్వాత ఖాతాలో ఆరు స్లైస్‌లు అంటే పూర్తి పిజ్జా కనిపిస్తుంది. అంటే ఉచిత పిజ్జాకు అర్హత లభించినట్టే.  చీజీ రివార్డ్స్ ప్రచారంపై డొమినోస్ పిజ్జా ఈవీపీ, సీఎంవో సందీప్ ఆనంద్ మాట్లాడుతూ..  కస్టమర్ డిలైట్ తమ నిరంతర ప్రయత్నమని అన్నారు. వినియోగదారులతో సంబంధాల పెంచుకోవడం, సెలబ్రేట్ చేసుకోవడం, రివార్డ్ చేసేందుకే ఈ చీజీ రివార్డ్స్ ప్రొగ్రామ్‌ను రూపొందించినట్టు చెప్పారు.  

Updated Date - 2022-08-05T03:22:18+05:30 IST