ఎస్‌బీఐ లాభం రూ.9,114 కోట్లు

ABN , First Publish Date - 2022-05-14T08:28:05+05:30 IST

ఎస్‌బీఐ లాభం రూ.9,114 కోట్లు

ఎస్‌బీఐ లాభం రూ.9,114 కోట్లు

న్యూఢిల్లీ : దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.9,114 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 క్యూ4లో ఆర్జించిన లాభం రూ.6,451 కోట్లతో పోల్చితే ఇది 41.28 శాతం అధికం. కాగా మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 55.19 శాతం వృద్ధితో రూ.20,401 కోట్ల నుంచి రూ.31,676 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 15.26 శాతం పెరిగి రూ.31,198 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌  0.29 శాతం పెరిగి 3.40 శాతంగా నమోదైంది.  స్థూల ఎన్‌పీఏలు 3.97 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.02 శాతానికి తగ్గాయి. క్యూ4లో ఎన్‌పీఏలుగా మారిన ఖాతాలు 0.43 శాతానికి తగ్గాయి.   

Read more