ఒకే రోజులో 1400కు పైగా వైట్ సైడెడ్ డాల్ఫిన్ల వధ

ABN , First Publish Date - 2021-09-16T23:46:42+05:30 IST

డెన్మార్క్‌లోని ఫారో ద్వీపంలో ఒకే రోజులో 1400కు పైగా వైట్ సైడెడ్ డాల్ఫిన్లను వేటాడి వధించడం తీవ్ర కలకలానికి దారితీసింది.

ఒకే రోజులో 1400కు పైగా వైట్ సైడెడ్ డాల్ఫిన్ల వధ

కోపెన్‌హెగన్: డెన్మార్క్‌లోని ఫారో ద్వీపంలో ఒకే రోజులో 1400కు పైగా వైట్ సైడెడ్ డాల్ఫిన్లను వేటాడి వధించడం తీవ్ర కలకలానికి దారితీసింది. ఈ పరిణామానికి వ్యతిరేకంగా ప్రజలు బహిరంగ నిరసన తెలిపారు. ఇది ఈ ద్వీపసమూహంలో చోటుచేసుకున్న అతిపెద్ద వేటగా నిరసనకారులు పేర్కొన్నారు. గతంలో కొద్ది మొత్తంలో గ్రిండడాప్ పద్ధతిలో (డాల్ఫిన్‌‌లను అర్ధ చంద్రకారంగా చుట్టుముట్టి... వాటిని తీరంవైపు తరలిస్తూ చంపడం) తిమింగలాలను వేటాడేవారు. 


ఈ ఘటనపై ప్రభుత్వ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘తిమింగలాలను గ్రిండ్ పద్ధతిలో వధించారు. వేటకు ఈ పద్ధతి సురక్షితమయినది అని ప్రభుత్వం భావిస్తుంది. ద్వీప సమూహంలోని 53 శాతం మంది ఈ పద్ధతిని వ్యతిరేకిస్తారు కానీ, ఈ పద్ధతిని రూపుమాపాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదు’’ అని చెప్పారు. సీ షెఫర్డ్ అనే స్వచ్ఛంద సంస్థ డాల్ఫిన్‌లను చంపడం అనేది అనాగరిక చర్యగా అభివర్ణించింది. ఈ సంస్థ డాల్ఫిన్‌ల వధకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఫారో ద్వీపంలో దాదాపుగా లక్ష తిమింగలాలు ఉంటే గత ఏడాది 600 వరకు చనిపోయాయి అని స్థానికులు తెలిపారు.

Updated Date - 2021-09-16T23:46:42+05:30 IST