ఎట్టకేలకు చిక్కిన డాలర్‌భాయ్‌!

ABN , First Publish Date - 2020-10-24T08:51:16+05:30 IST

ఎట్టకేలకు చిక్కిన డాలర్‌భాయ్‌!

ఎట్టకేలకు చిక్కిన డాలర్‌భాయ్‌!

గోవాలో అరెస్టు చేసిన సీసీఎస్‌   

రెండు నెలలుగా పరారీలో  రాజశ్రీకర్‌


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): రెండు నెలలుగా పరారీలో ఉన్న డాలర్‌ భాయ్‌ అలియాస్‌ రాజశ్రీకర్‌ను ఎట్టకేలకు గోవాలో సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఈ ఏడాది ఆగస్టు 20న ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం.. డాలర్‌ భాయ్‌ కారణంగానే అంతమంది పేర్లను తాను ఫిర్యాదులో చేర్చానని యువతి వెల్లడించింది. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్‌- మహిళా పోలీ్‌సస్టేషన్‌కు అప్పగించారు. బాధితురాలిని వేధించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి, బెదిరింపులకు పాల్పడిన డాలర్‌ భాయ్‌ అప్పటి నుంచీ పరారీలోనే ఉన్నాడు. తాజాగా గోవాలో చిక్కిన నిందితుడిని నగరానికి తరలించినట్లు సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి తెలిపారు. సేకరించిన ఆధారాల మేరకు అతడిని కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు.


డాలర్‌భాయ్‌ లీలలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరీబ్‌పేట, రామవరం గ్రామానికి చెందిన సనిగరపు శ్రీకర్‌రెడ్డి అలియాస్‌ డాలర్‌భాయ్‌పై గత ఏడాది రెండు కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం త్రీటౌన్‌ పీఎ్‌సలో నమోదైన చీటింగ్‌ కేసుతో పాటు సీసీఎ్‌సడీడీ మహిళా పీఎ్‌సలో వరకట్న వేధింపుల కేసు ఉంది. డాలర్ల తయారీ(లాకెట్‌లు), దేవతల విగ్రహాలు, కుబేర యంత్రాలు తయారు చేసి వాటిని పూజా సామగ్రి స్టోర్‌లలో విక్రయించే వ్యాపారం చేసేవాడు. గత ఏడాది తన పేరును శ్రీకర్‌ నుంచి రాజశ్రీకర్‌రెడ్డిగా మార్చుకుని హైదరాబాద్‌, సోమాజిగూడలో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని స్పీడ్‌ జెట్‌ హాలిడే ప్యాకేజీ బుకింగ్‌ పేరిట ఓ సంస్థను ప్రారంభించాడు. తన కార్యాలయంలోనే పని చేస్తున్న బాధితురాలిని లొంగదీసుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలికి పరిచయమున్న వారి కాంటాక్ట్‌ నెంబర్లు సేకరించి.. ఆమె ఫోన్‌ నుంచి వారికి ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయా బాధితులు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు అత్యాచారానికి పాల్పడ్డారంటూ వారి పేర్లు చేర్చి బాధితురాలితో పంజాగుట్ట పీఎ్‌సలో ఫిర్యాదు చేసేలా ఒత్తిడి చేశాడు. అతని చెర నుంచి బయటకు వచ్చిన బాధితురాలు పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన వాస్తవాలు వెల్లడించడంతో కేసు మలుపు తిరిగింది.

Updated Date - 2020-10-24T08:51:16+05:30 IST