బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం

ABN , First Publish Date - 2021-06-22T05:32:11+05:30 IST

మండల పరిధిలోని ఏల్గోయి గ్రామంలో జూలై 11న బాల్య వివాహం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో సోమవారం ఆ గ్రామానికి ఐసీడీఎస్‌ అధికారి సునీత, పోలీస్‌ సిబ్బంది వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ చేశారు.

బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం

ఝరాసంగం, జూన్‌ 21 : మండల పరిధిలోని ఏల్గోయి గ్రామంలో జూలై 11న బాల్య వివాహం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో సోమవారం ఆ గ్రామానికి ఐసీడీఎస్‌ అధికారి సునీత, పోలీస్‌ సిబ్బంది వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాలికలకు 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వివాహం చేయరాదన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే బాల్య వివాహ చట్టం 2001 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-06-22T05:32:11+05:30 IST