ప్రపంచంలో తొలిసారిగా.. కుక్కల మానసిక ఉల్లాసం కోసం ఓ టీవీ చానెల్!

ABN , First Publish Date - 2021-11-27T02:30:22+05:30 IST

మనుషుల కోసం ప్రస్తుతం చాలా రకాల టీవీ చానెళ్లు అందుబాటులో ఉన్నాయి. వంటల చానెళ్లు, ఆటల చానెళ్లు, సినిమాల చానెళ్లు.. ఇలా రకరకాల చానెళ్లు ఉన్నాయి. ఇందులో ఎవరికి నచ్చినవి వాళ్లు చూస్తూ

ప్రపంచంలో తొలిసారిగా.. కుక్కల మానసిక ఉల్లాసం కోసం ఓ టీవీ చానెల్!

ఇంటర్నెట్ డెస్క్: మనుషుల కోసం ప్రస్తుతం చాలా రకాల టీవీ చానెళ్లు అందుబాటులో ఉన్నాయి. వంటల చానెళ్లు, ఆటల చానెళ్లు, సినిమాల చానెళ్లు.. ఇలా రకరకాల చానెళ్లు ఉన్నాయి. ఇందులో ఎవరికి నచ్చినవి వాళ్లు చూస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి.. జంతువులు మాత్రమే చూసేందుకు ఏమైనా చానెళ్లు ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానం లేదనే చెప్పాలి. అయితే ఈ ప్రశ్నను చూసిన తర్వాత చాలా మంది జంతువులకు కూడా ప్రత్యేకంగా ఓ చానెల్ అవసరమా అని ఆశ్చర్యపోతారు. కానీ.. దీనికి కొందరు శాస్త్రవేత్తలు అవుననే సమాధానం చెబుతున్నారు. ఈ క్రమంలోనే యూకేలో ప్రత్యేకించి శునకాల కోసం తాజాగా ఓ టీవీ చానల్ కూడా లాంచ్ అయింది. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. 


యజమానులు ఇంట్లో లేనప్పుడు.. పెంపుడు కుక్కలు ఇంట్లోనే ఒంటరిగా ఉంటాయి. ఈ క్రమంలో అవి ఒంటరితనంగా ఫీల్ అవడంతోపాటు, ఒత్తిడికి గురై ఆందోళనలు చెందుతాయట. కాగా.. ఇటువంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్న శునకాలకు ఉపశమనం కలిగించేందుకు.. యూకేలోని కొందరు ‘డాగ్ టీవీ’ పేరుతో టీవీ చానెల్‌ను ప్రారంభించారు. ఇందులో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌ల వల్ల శునకాల్లో ఒత్తిడి, లోన్లీనెస్ పోయి.. అవి రిలాక్స్ అవుతాయని చానెల్ నిర్వాహకులు చెబుతున్నారు. వీటితోపాటు పెంపుడు శునకాలు ఇచ్చే సంకేతాలను వాటి యజమానులు అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని కార్యక్రమాలను రూపొందించినట్టు పేర్కొంటున్నారు.



‘డాగ్‌టీవీ’ చానెల్‌ను రూపొందించడంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త, ప్రొఫెసర్ నికోలస్ డాడ్మాన్ మాట్లాడుతూ.. సైంటిఫిక్‌గా టెస్ట్ చేసిన ప్రోగ్రామ్‌లను మాత్రమే చానెల్‌లో ప్రసారం అవుతాయని చెప్పారు. జంతువుల  సైకాలజీ, వాటి అవసరాలపై మూడేళ్లపాటు పరిశోధనలు జరిపిన తర్వాతే టీవీ ప్రోగ్రామ్‌లను రూపొందించినట్టు వెల్లడించారు. కాగా.. స్మార్ట్ టీవీ, ఆడ్రయిడ్, యాపిల్ డివైజ్‌ల ద్వారా డాగ్‌టీవీ చానల్‌లోకి సైన్ అప్ కావొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా.. మంత్లీ/ఇయర్లీ పద్ధతుల్లో కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా ’డాగ్‌టీవీ’ పెట్ ఓనర్లు  సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని వెల్లడించారు. 




Updated Date - 2021-11-27T02:30:22+05:30 IST