Viral Video: పొలానికి నీరు పెడుతున్న కుక్క.. వామ్మో ఇదేం కుక్కరా నాయనా..

ABN , First Publish Date - 2022-03-12T02:54:01+05:30 IST

కొన్ని జంతువులు చేసే పనులు చూస్తే.. స్వతహాగా చేస్తున్నట్లే కనిపిస్తాయి. శిక్షణ ఇచ్చినట్లు ఇసుమంత అనుమానం కూడా రాదు. మరికొన్ని జంతువులైతే ఎలాంటి శిక్షణ లేకుండానే..

Viral Video: పొలానికి నీరు పెడుతున్న కుక్క.. వామ్మో ఇదేం కుక్కరా నాయనా..

కొన్ని జంతువులు చేసే పనులు చూస్తే.. స్వతహాగా చేస్తున్నట్లే కనిపిస్తాయి. శిక్షణ ఇచ్చినట్లు ఇసుమంత అనుమానం కూడా రాదు. మరికొన్ని జంతువులైతే ఎలాంటి శిక్షణ లేకుండానే సహజంగానే మనుషులను అనుకరించడం, మనుషులు చేసే పనులను అచ్చం అలాగే చేయడం వంటివి చేస్తుంటాయి. చింపాంజీ, కోతి తదితర జంతువులు మనుషుల తరహాలో చేసే పనులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. తాజాగా పొలానికి నీరు పెడుతున్న కుక్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కుక్కలకు స్వతహాగానే చాలా తెలివి ఉంటుంది. వివిధ కేసులను ఛేదించడంలో కుక్కలు కీలక పాత్ర పోషిస్తాయన్నది మనందరికీ తెలిసిన విషయమే. కొన్ని జాతులకు సంబంధించిన కుక్కలైతే ఎంతో చాకచక్యంగా ఉంటాయి. అందుకే అలాంటి కుక్కలను లక్షలు ఖర్చు చేసి మరీ కొంటుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుక్క పొలానికి నీరు పెట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ పొలం వద్ద కుక్క దేనికోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలోనే నీటి ప్రవాహం కుక్క వద్దకు వస్తుంది. దీంతో ఆ నీరు పొలంలో అటూ,ఇటూ పోకుండా దారి చేస్తూ వెళ్తుంది. వేగంగా వెళ్తున్న నీటికి.. అంతే వేగంగా కాలువ తీస్తూ వెనక్కు వెనక్కు వెళ్లడం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి కుక్క ఉంటే మనుషి అవసరం లేదు’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఖడ్గమృగంతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. సింహాలను తరిమి తరిమి కొట్టిందిగా..





Updated Date - 2022-03-12T02:54:01+05:30 IST