Watch: ఆ శునకాన్ని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో!

ABN , First Publish Date - 2022-07-10T23:34:38+05:30 IST

జల వనరులను కాపాడుకోవాలని, నీటిని వృథా చేయవద్దని పర్యావరణ ప్రేమికులు, ప్రభుత్వ అధికారులు తరచుగా చెబుతుంటారు.

Watch: ఆ శునకాన్ని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. ఆకట్టుకుంటున్న వైరల్ వీడియో!

జల వనరులను కాపాడుకోవాలని, నీటిని వృథా చేయవద్దని పర్యావరణ ప్రేమికులు, ప్రభుత్వ అధికారులు తరచుగా చెబుతుంటారు. అయినా చాలా మంది ఆ మాటలను పట్టించుకోకుండా నీటిని వృథా చేస్తుంటారు. అయితే ఓ శునకం మాత్రం మంచినీళ్లను తాగిన తర్వాత కుళాయిని కట్టేసి బాధ్యతగా ప్రవర్తించింది. IPS Officer దీపాంశు కబ్రా ట్విటర్‌లో షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఆ వీడియో ప్రకారం.. లాబ్రడార్ జాతికి చెందిన కుక్క కుళాయి ఓపెన్ చేసి మంచినీళ్లు తాగింది. అనంతరం కుళాయి కట్టేసింది. ఆ వీడియోను దీపాంశు షేర్ చేసి.. `ప్రతి నీటి చుక్కా చాలా విలువైంది. ఆ విషయాన్ని శునకం అర్థం చేసుకుంది. మరి, మనుషులు ఎప్పుడు అర్థం చేసుకుంటారు` అని కామెంట్ చేశారు. ఆ శునకంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. `ఆ కుక్క చాలా మందికి విలువైన పాఠం నేర్పించింద`ని కొందరు కామెంట్లు చేశారు. 


Updated Date - 2022-07-10T23:34:38+05:30 IST