మధిర: ఆసుపత్రి బెడ్‌పై కుక్క

ABN , First Publish Date - 2020-08-13T17:42:54+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు మామూలుగా లేవు.

మధిర: ఆసుపత్రి బెడ్‌పై కుక్క

మధిర: తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు మామూలుగా లేవు. కరోనా సెంటర్లలో అయితే బాధితుల గోడు వర్ణణాతీతంగా ఉంది. బెడ్లు నిండిపోవడంతో అటు కరోనా రోగులు.. ఇటు ఇతరాత్ర వ్యాధులతో బాధపడుతున్న రోగులు అల్లాడిపోతున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఓ బెడ్‌పై శునకం (కుక్క) దర్జాగా పడుకుంది. ఖమ్మం జిల్లా, మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ దృశ్యం కనిపించింది. వార్డులో రోగులు ఉండాల్సిన బెడ్లపై కుక్కలు సేదదీరుతున్నాయి. అసలు కరోనాతో రోగులు, వారి సహాయకులు భయపడుతుంటే.. ఏకంగా వార్డుల్లోకి బెడ్‌పైకెక్కి కుక్క కూర్చున్నా పట్టించుకునే సిబ్బంది లేరు. వీధి కుక్కలు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి తమచెంత తిరుగుతున్నాయని పెషేంట్లు భయపడుతున్నారు. కుక్కలు తిరుగుతున్నాయని మొత్తుకుంటున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Updated Date - 2020-08-13T17:42:54+05:30 IST