గిన్నిస్ రికార్డు్లో శునకం.. అదేం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-04-20T08:31:58+05:30 IST

క్యూట్‌గా కనిపిస్తున్న ఉన్న ఈ కుక్క పేరు టోబీకీత్‌. అమెరికాకు చెందిన గిసెల్లా షోర్‌ అనే మహిళ దీన్ని పెంచుకుంటోంది. ఇది అనాయింట్స్‌ చినుహుహా జాతికి చెందినది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ శునకం ఇప్పుడు గిన్నెస్‌ రికార్డుల్లోకి...

గిన్నిస్ రికార్డు్లో శునకం.. అదేం చేసిందంటే..

క్యూట్‌గా కనిపిస్తున్న ఉన్న ఈ కుక్క పేరు టోబీకీత్‌. అమెరికాకు చెందిన గిసెల్లా షోర్‌ అనే మహిళ దీన్ని పెంచుకుంటోంది. ఇది అనాయింట్స్‌ చినుహుహా జాతికి చెందినది. దీని ప్రత్యేకత ఏమిటంటే..  ఈ శునకం ఇప్పుడు గిన్నెస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 


ప్రపంచంలోనే ప్రాణాలతో ఉన్న అత్యధిక వయసు కలిగిన శునకంగా ఇది రికార్డు సాధించింది. దీని వయసు 21 ఏండ్ల 66 రోజులు. సాధారణంగా ఈ జాతి శునకాలు 12 నుంచి 18 సంవత్సరాలు జీవిస్తాయి. 


ముద్దుగా ఉన్న టోబీకీత్‌ నెలల వయసున్నప్పుడు గిసెల్లా దానిని ఒక అనిమల్ సెంటర్ (జంతు సంరక్షణా కేంద్రం) నుంచి దత్తత తీసుకొని పెంచుకుంటోంది. ఇప్పుడు టోబీకీత్ పేరు గిన్నిస్ రికార్డుల్లో నమోదవడంతో ఆమె సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.

Updated Date - 2022-04-20T08:31:58+05:30 IST