జార్జియాలో పెంపుడు కుక్కకూ కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-07-04T12:37:07+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఓ పెంపుడు కుక్కకూ సోకిన ఘటన జార్జియా దేశంలో వెలుగుచూసింది.....

జార్జియాలో పెంపుడు కుక్కకూ కరోనా పాజిటివ్

అట్లాంటా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఓ పెంపుడు కుక్కకూ సోకిన ఘటన జార్జియా దేశంలో వెలుగుచూసింది. 6 సంవత్సరాల వయసున్న ఓ మిశ్రమ జాతి కుక్క నాడీ సంబంధ అనారోగ్యంతో బాధపడుతుండటంతో దాని యజమానులు కరోనా పరీక్ష చేయించారు. కుక్కకూ కరోనా వైరస్ సోకిందని తేలినట్లు జార్జియా ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. కరోనా వైరస్ వల్లనే కుక్కకు నాడీ సంబంధ అనారోగ్యం సంభవించిందని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. పెంపుడు జంతువులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెపుతున్నా కుక్కకు కూడా కరోనా సోకడం సంచలనం రేపింది. గతంలో అమెరికాలో ఓ పులికి కూడా కరోనా సోకింది. 

Updated Date - 2020-07-04T12:37:07+05:30 IST