మృతి చెందిన కుక్క
శాంతిపురం, జనవరి 27: శాంతిపురం నడిబొడ్డున నాటుబాంబు పేలుడు కలకలం సృష్టించింది. గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో బస్టాండులోని పండ్ల దుకాణాల మధ్యలో ఓ కుక్క నాటుబాంబును కొరకడంతో అది పేలి పెద్దశబ్దం వచ్చింది. స్థానికులు ఆ ప్రదేశానికి వెళ్ళి చూడగా తల పగిలి కుక్క మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. వన్యప్రాణుల వేటకు వినియోగించే నాటుబాంబు మండలకేంద్రం నడిబొడ్డున పేలడంపై స్థానికులు భయాందోళన చెందారు. రాళ్ళబూదుగూరు పోలీసులను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.