Abn logo
Sep 19 2021 @ 15:21PM

ఈ శునకం, పిల్లిని చూశారా.. వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాయి.. ఎలా అంటే..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మనం చూసినంత వరకూ పిల్లి, కుక్క బద్ద శత్రువులు.  పిల్లిని చూస్తే కుక్క విరుచుకుపడుతుంది. దానిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది కదా. అయితే ఓ పిల్లి, కుక్క మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాయి. ఎప్పుడూ జగడమేనా.. ట్రెండ్ సెట్ చేద్దాం అనుకున్నాయేమో కానీ.. రెండూ కలిసి ఓ పోటీలో పాల్గొని ఏకంగా వరల్డ్ రికార్డునే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  


వీడియోలోని దృశ్యాల ప్రకారం.. లాలీపప్ అనే ఐదేళ్ల శునకం, సాషిమి అనే 7ఏళ్ల పిల్లి కలిసి స్కూటర్‌పై రైడింగ్ చేశాయి. లాలీపప్ వెనకలా ఉండి.. కాళ్లతో స్కూటర్‌ను నెడుతుంటే.. సాషిమి మాత్రం ముందు నిల్చుని హ్యాండిల్‌ను ఇటు.. అటు.. తిప్పింది. ఈ వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా లాలీపప్, సాషిమి.. రెండూ కలిసి స్కూటర్‌పై కేవలం 4.37 సెకన్లలో 5 మీటర్ల దూరం ప్రయణించాయని వెల్లడించారు. దీంతో స్కూటర్‌పై ఐదు మీటర్ల దూరాన్ని అత్యంత తక్కువ సమయంలో చేరుకున్న జంటగా ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో లాలీపప్, సాషిమిల యజమాని స్పందించారు. తన పెంపుడు జంతువులు ప్రపంచ రికార్డు నెలకొల్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ పిల్లి, కుక్కుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. 


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...