కాసులిస్తేనే సర్వర్‌ పనిచేస్తుందా..!

ABN , First Publish Date - 2022-08-17T05:03:49+05:30 IST

సచివాలయాల సిబ్బందికి కాసులిస్తేనే సర్వర్‌ పనిచేస్తుందని జడ్పీటీసీ సభ్యురాలు యార్లగడ్డ రజని ఆవేదన వ్యక్తం చేశారు.

కాసులిస్తేనే సర్వర్‌ పనిచేస్తుందా..!
మాట్లాడుతున్న ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు

 మండల సమావేశంలో జడ్పీటీసీ ఆగ్రహం

కారంచేడు(పర్చూరు), అగస్టు 16: సచివాలయాల సిబ్బందికి కాసులిస్తేనే సర్వర్‌ పనిచేస్తుందని జడ్పీటీసీ సభ్యురాలు యార్లగడ్డ రజని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కారంచేడు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ భూమి మ్యుటేషన్‌ కోసం రైతులు ఎన్నిమార్లు తిరిగినా సర్వర్‌ కలవటం లేదని సచివాలయ సిబ్బంది కుంటిసాకులు చెబుతున్నారన్నారు. అయితే, డ బ్బులు ఇవ్వగానే సర్వర్‌ అందుబాటులోకి వచ్చి పనిచేయటం విడ్డూ రంగా ఉందన్నారు. ప్రజలకు రైతులకు మెరుగైన సేవలు అందించేం దుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ కొంతమంది సిబ్బంది నిర్వాహకం వల్ల నీరుకారుతుందన్నారు. 

దీనిపై  స్పందించిన తహసీల్దార్‌ ఎస్‌.వెంకటరత్నం మాట్లాడుతూ ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామ న్నారు. కోఆప్షన్‌ సభ్యుడు ముల్లా నూర్‌అహ్మద్‌ మాట్లాడుతూ రెవె న్యూ సదస్సులు ఏర్పాటుచేసి రైతులకు అవగాహన కల్పించాలని కోరా రు. జేసీ అనుమతితో మండలంలో షెడ్యూల్‌ ప్రకటిస్తామని తహసీల్దా ర్‌ సమాధానం ఇచ్చారు. అనంతరం ఆయా శాఖల అధికారులతో వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.  కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీలు యార్లగడ్డ సుబ్బారావు, ఐనంపూడి వనజ, ఎంపీడీవో రమేష్‌బాబు, ఆయా శాఖల అధికారులు పా ల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T05:03:49+05:30 IST