బార్లలో రాని కరోనా బడుల్లో వస్తుందా?

ABN , First Publish Date - 2022-01-18T06:07:04+05:30 IST

బార్‌లలో, సినిమాహాల్‌లలో రానీ కరోనా బడుల ల్లో వస్తుందా అని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

బార్లలో రాని కరోనా బడుల్లో వస్తుందా?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

సూర్యాపేటటౌన్‌, జనవరి 17: బార్‌లలో, సినిమాహాల్‌లలో రానీ కరోనా బడుల ల్లో వస్తుందా అని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓప్రైవేట్‌ పాఠశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు, బటహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరంచేసే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబందు పేరుతో వారోత్సవాలు, సమావేశాలు వేల సంఖ్యలో ప్రజలతో నిర్వహిస్తుందని, అప్పుడు రానీ కరోనా పాఠవాల్లో కొద్ది సంఖ్యలో విద్యార్థులతో నడుపుతున్న పాఠశాలల్లో ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే కరోనాతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడు ఆన్‌లైన్‌ విద్యతో విద్యార్థులకు స్మార్టుపోన్‌లు కొనిచ్చే స్తోమత లేదని ఆవేదనవ్యక్తం చేశారు. 15సంవత్సరాలు నిండిన పిల్లలకు ఒకవైపు వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారని వెంటనే యూనివర్సీటీలను, పాఠశాలలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న జీవో నెంబరు 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆసంఘం జిల్లా అద్యక్షుడు చలమల్ల నర్సింహా, తన్నీరు రాంప్రభు, భైపతి నారాయణగౌడ్‌, మట్ట రమేష్‌, లింగయ్య, అనిల్‌కుమార్‌, అశోక్‌గౌడ్‌, కృష్ణ, లింగస్వామి, ఉపేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T06:07:04+05:30 IST