‘అర్ధాంతరంగా బీసీ భవన్‌ను వదిలేస్తారా?’

ABN , First Publish Date - 2022-05-24T06:22:18+05:30 IST

గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బీసీ భవ న్‌ను పునాదుల దగ్గరే వదిలేస్తారా? అని తెలుగుదేశం బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ ప్రశ్నించారు.

‘అర్ధాంతరంగా బీసీ భవన్‌ను వదిలేస్తారా?’

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 23: గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బీసీ భవ న్‌ను పునాదుల దగ్గరే వదిలేస్తారా? అని తెలుగుదేశం బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ ప్రశ్నించారు. సోమవారం కర్నూలు నగరంలోని బీ.క్యాంపులో  రూ.5కోట్ల నిధులతో  చేపట్టిన బీసీ భవన్‌ నిర్మాణ పనులను నాగేశ్వరరావు యాదవ్‌తోపాటు ఆ పార్టీ నేతలు విజయకుమార్‌, రాంబాబు, రాజు యాదవ్‌ పరిశీలించారు. బీసీ కులాల అభివృద్ధి కోసమని గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.5 కోట్ల నిధులను విడుదల చేసి బీసీ భవన్‌ నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారని అన్నారు. అయితే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయ్యా క బీసీ భవన్‌ నిర్మాణాల నిధులను దారి మళ్లించడంతో కాంట్రాక్టర్లు  పనులు నిలిపివేశారని నాగేశ్వరరావు యాదవ్‌ విలేకరులకు వివరించారు. తెలుగుదేశం ప్రభత్వ హయాంలో ఈ బీసీ భవన్‌ మంజూరు కావడాన్ని సహించలేక  సీఎం జగన్‌ నిధులను దారి మళ్లించారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే బీసీలపై జగన్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని ఆయన ధ్వజమెత్తారు. బీసీలు తన ప్రభుత్వానికి, పార్టీకి వెన్నెముక అని చెప్పుకొనే జగన్‌ బీసీ కులాల కోసం నామమాత్రంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని అన్నారు.  రెండేళ్లవుతున్నా కనీస పథకాలకు  నిధులు  మంజూ రు చేయకపోవడం దారుణమన్నారు. కార్యాలయాల్లో కార్పొరేషన్ల చైర్మన్లు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేఈ కుమార్‌, టీడీపీ బీసీ సెల్‌ అధికార ప్రతినిధి రాజు యాదవ్‌, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాం బాబు, నాగభూషణంగౌడు, విద్యార్థి సంఘాల నాయకులు మోహన్‌, ఈశ్వరయ్య, సుబ్హాన్‌, సురేంద్ర పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T06:22:18+05:30 IST