ప్రాణత్యాగం అక్కర్లేదు

ABN , First Publish Date - 2021-01-24T07:52:49+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులెవరైనా రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిందేనని, ఎవరికి వా రు రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.

ప్రాణత్యాగం అక్కర్లేదు

  • రక్షణ కావాలంటే ప్రభుత్వాన్ని అడగొచ్చు
  • మాజీ చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం
  • ఉద్యోగులు రాజ్యాంగబద్ధులై పని చేయాలి


తెనాలి, జనవరి 23: ప్రభుత్వ ఉద్యోగులెవరైనా రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిందేనని, ఎవరికి వా రు రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు శనివా  రం ఆయన గుంటూరు జిల్లా తెనాలి వచ్చారు. ఎన్నికల కమిషన్‌ తీసుకుంటున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టడం, ఉద్యోగులు కూడా అందుకు వంతపాడటాన్ని ఆయన ఈ సందర్భంగా ఆక్షేపించారు. ‘రాజ్యాంగాన్ని మనం కాపాడితే రేపటి రోజున మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనది రాజ్యాంగమే,. రాజ్యాంగ స్ఫూర్తితో ఎంతో మంది పని చేసి గతంలో ప్రాణాలు సైతం త్యాగం చేశారు. కానీ, ప్రస్తుతం ఉద్యోగులకు ప్రాణత్యాగం చేసేంత అవసరం లేదు. ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా ఎన్నికల కమిషన్‌ చూస్తుంది. మరింత రక్షణ కావాలంటే ప్రభుత్వం, కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లవచ్చ’ని చెప్పారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, ధర్మాన్ని రక్షించే విధంగానే రాజ్యాంగాన్ని కూడా పరిరక్షిస్తే మనల్ని మనం కాపాడుకున్నట్లేనని ఎల్వీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-24T07:52:49+05:30 IST